Feb 07,2023 22:52

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరుణాళ్ల మహోత్సవంలో భాగంగా మంగళవారం శ్రీ అంకమ్మ అమ్మవారి క్రతువుల్లో భాగంగా కుమ్మరులు, రజకులు, బేతాళుడు, కొమ్మలు వారు ఆలయంలో ఉదయ పొంగళ్లు (అంకెసేవ) చేసి అమ్మవారికి నివేదించారు. ఆచారానికి అనుగుణంగా జల బిందెల మహోత్సవంలో జల బిందెలు మోసిన వారు ఇత్తడి పాత్రల్లో మూడు వత్తులు వెలిగించి ప్రధాన ఆలయంతో పాటు దేవతామూర్తుల ఆలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం బారినుండి వారితో ఒగ్గు కథ చెప్పించారు. పెద్దసంఖ్యలో యాత్రికులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్న కేశవరావు పాల్గొన్నారు.