ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు
స్ధానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన హండీల కానుకలు ద్వారా 1,12,92,200 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి లీలా కుమార్ తెలిపారు. ఆలయంలోని హుండీల లెక్కింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. సాధారణ హుండీల ద్వారా 1,03,70, 560 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 9,21,640 రూపాయలు మొత్తం వెరసి 1,12,92,200 రూపాయల నగదు, అలాగే 248 విదేశీ డాలర్స్, 0.87 మిల్లీ గ్రాముల బంగారం, 0.900 మిల్లీ గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని అన్నారు. ఈ మొత్తం ఆదాయం కేవలం 95 రోజుల వ్యవధిలోనే అమ్మవారికి సమకూరిందని తెలి పారు. ఆలయ చైర్మన్ చెన్న కేశవరావు, నందిగామ గ్రూప్ ఆలయాల ఇన్‌స్పెక్టర్ అనూరాధ సిబ్బంది పాల్గొన్నారు.










