తిరుపతిలో 'కావేరీ క్లినిక్' ప్రారంభం
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: దక్షిణ భారతదేశంలోని మల్టీ-స్పెషాలిటీ ఆరోగ్య సంరక్షణ రంగంలో సుప్రసిద్ధమైన పేరు సంపాదించుకున్న చెన్నై రేడియల్ రోడ్డులోని కావేరీ హాస్పిటల్ తిరుపతిలో తమ సమాచార కేంద్రాన్ని, క్లినిక్‌ను తిరుపతిలో ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. తిరుపతి వాసులకు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఆరోగ్య సంరక్షణ అవసరాలను ఈ కేంద్రం తీరుస్తుందని, నిపుణుల ద్వారా వైద్యసంప్రదింపులు అత్యున్నత శ్రేణి ఆరోగ్యసంరక్షణ సేవలకు ఈ నూతన కేంద్రం హామీ ఇస్తోందని పేర్కొన్నారు. ఈసమాచార కేంద్రంలో న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్ధోపెడిక్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, వివిధ ఇతర వైద్యవిభాగాల్లో నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు ఉంటారని, నిపుణులు వారంలో నిర్దేశించిన రోజుల్లో అందుబాటులో ఉంటారని వారు షెడ్యూల్స్ గురించి ముందుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రోగులు తమ కన్సల్టేషన్ల కోసం ప్రణాళిక వేసుకోవడానికీ, సకాలంలో నైపుణ్యమైన వైద్యసంరక్షణను అందుకోవడానికీ ఈ సానుకూల దక్పథం దోహదం చేసుందన్నారు. తిరుపతిలో వైద్యులను సప్రదించడానికి 76809 38555 నంబర్‌ను పప్రదించాలని కోరారు.










