Sep 14,2023 20:41

డబుల్‌ డెక్కర్‌ ట్రయల్‌రన్‌

తిరుపతిలో డబుల్‌ డెక్కర్‌ బస్సు
గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుపతి నగర డిప్యూటీ మేయర్‌ భూమన అభినరురెడ్డి చొరవతో తిరుపతి ఎలక్ట్రికల్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఇండియన్‌ మేడ్‌ ఫుల్‌ ఎలక్ట్రికల్‌ డబుల్‌ డెక్కర్‌ బస్‌ గురువారం మధ్యాహ్నం తిరుపతి శివార్లకు చేరుకోగానే భూమన అభినరు ఆధ్వర్యంలో ఎదురెళ్లారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినరురెడ్డి మాట్లాడుతూ గంగమ్మతల్లి ఆశిస్సులతో తిరుపతి అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. తిరుపతి ప్రజారవాణా వ్యవస్థలో ఇది మరో ముందడుగని అన్నారు. అవసరాలను బట్టి భవిష్యత్‌లో మరిన్ని డబుల్‌ డెక్కర్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఒక బస్సును అందుబాటులోకి తెచ్చామని, ప్రజా స్పందన బాగుంటే భవిష్యత్‌లో మరిన్ని డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకొచ్చే అంశాన్ని నగర పాలక సంస్థ పరిశీలిస్తుందని చెప్పారు.
తిరుపతిలో పరుగులు తీసిన డబుల్‌డెక్కర్‌
తిరుపతి స్మార్ట్‌ సిటీ పథకంలో రెండు కోట్ల 31 లక్షలతో డబుల్‌ డెక్కర్‌ బస్సును కొనుగోలు చేశారు. గురువారం ఆర్టిసి అధికారులకు ఈ బస్సును అందజేశారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 150 బైపాస్‌ రోడ్డు మీదుగా దీన్ని ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అక్కడినుంచి కరకంబాడి రోడ్డు తిరుమల బైపాస్‌ రోడ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్లు ఆర్టిసి అధికారులు పేర్కొన్నారు. త్వరలో తిరుపతి ప్రజలకు ఈ బస్సు అందుబాటులో తీసుకురానున్నారు. డబుల్‌ డెక్కర్‌ బస్సు ఇప్పటికే ముంబై ,హైదరాబాదులో యాత్రికుల కోసం నడుపుతూ ఉన్నారు. తిరుపతి వచ్చేవారి కోసం ఈ బస్సు నడపాలని భావిస్తున్నారు
డబుల్‌ డెక్కర్‌ ట్రయల్‌రన్‌