Dec 21,2022 22:21

పనులు జరుగుతున్న దృశ్యం

యుద్ధప్రాతిపదికన 60 శాతం పనులు పూర్తి
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌

తిరుపతి రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులు దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ముమ్మరంగా సాగుతు న్నాయి. ఈపిసి విధానంలో జరుగుతున్న ఈ పనులు ఫిబ్రవరి, 2025 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. రాబోయే 40 ఏళ్లకు అనుగుణంగా రైలు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేషన్‌ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇప్పటికే తిరుపతి రైల్వేస్టేషన్‌కు దక్షిణం వైపున పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో కొత్త స్టేషన్‌ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పనుల్లో మొదటగా జియోలాజికల్‌ సర్వే పూర్తయిన తర్వాత క్యాంప్‌ ఆఫీస్‌, కాంక్రీట్‌ ల్యాబ్‌, స్టోరేజ్‌ షెడ్‌ల ఏర్పాటుకు సంబందించిన పనులు ముందుకు సాగుతున్నాయి. భూగర్భ పార్కింగ్‌, ఇతర సౌకర్యాల ఏర్పాటుకోసం బేస్మెంట్‌ నిర్మించేందుకు భూమి తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి . కొత్తగా నిర్మించనున్న స్టేషన్‌ భవనానికి పునాదుల పనులు పూర్తి అయ్యాయి . బేస్‌మెంట్‌ ఫ్లోర్‌, గోడను సుమారు 5,600 కాంక్రీటుతో ఇప్పటి వరకు పూర్తి చేసారు . కొత్త అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ లో 2 వీలర్స్‌ , అలాగే 4 వీలర్‌ వెహికల్స్‌ రెండింటినీ కలిపి పార్క్‌ చేసే విదంగా సదుపాయం కలిగి ఉంది. దీంతో పాటు బేస్‌మెంట్‌ ఫ్లోర్‌ రిటైనింగ్‌ వాల్‌లో అరవైశాతం పూర్తయింది. ఇప్పటి వరకు, దాదాపు 1100 రీన్‌ఫోర్స్‌ మెంట్‌ స్టీల్‌ను ఫౌండేషన్‌, రిటైనింగ్‌ గోడలలో ఉపయోగించారు. బేస్‌ మెంట్‌ , ఫ్లోర్‌ స్లాబ్‌ను కాంక్రీట్‌ చేయడానికి సెంట్రింగ్‌ షట్టరింగ్‌కు సంబంధించి 20 శతం పనులు పూర్తయ్యాయి.తిరుపతి స్టేషన్‌ పునరాభివద్దికి సంబందించిన ప్రతిపాదిత నమూనా ను తిరుపతి స్టేషన్‌ ప్రవేశద్వారం వద్ద సాధారణ ప్రజలకు ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. ఈ మోడల్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు డిజైన్‌ను చూసి మెచ్చుకుంటున్నారు. బుధవారం అనగా తేదీ 21 డిసెంబర్‌ 2022న తిరుపతి పట్టణంలోని అక్కరంపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు , పాఠశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో విద్యా విహార యాత్రలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా, ప్రదర్శన కోసం సమర్పించిన తిరుపతి స్టేషన్‌ నమూనాను విద్యార్థులు తిలకించారు. ప్రయాణికులకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తిరుపతి స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్‌ పనులపై ప్రత్యేక దష్టి సారించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రతి దశలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నమని తెలిపారు. నిర్మాణ సంస్థకు పూర్తి సహకారం అందించాలని రైల్వే అధి కారులను, సిబ్బందిని జనరల్‌ మేనేజర్‌ ఆదేశించారు.