Sep 17,2023 00:20

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):

తిరుపతి రూరల్‌లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సెలక్షన్స్‌
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మంగళం పరిధిలోని మంగళం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(మంగళం ట్రెండ్స్‌) లో శనివారం తిరుపతి రూరల్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సెలక్షన్స్‌ను నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.కేశవుల నాయుడు తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో 285 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో కబడ్డీ, కోకో, బాల్‌ బ్యాడ్మింటన్‌ మొదలైన క్రీడల్లో మంగళం ట్రెండ్స్‌ స్కూల్‌, చెర్లోపల్లి, తిరుచానూరు, దుర్గ సముద్రం, పెరుమాల్లపల్లి, మల్లంగుంట స్కూల్‌ క్రీడాకారులు ప్రతిభ చూపి నియోజకవర్గం పోటీలకు ఎంపికయ్యారన్నారు. మంగళం సర్పంచ్‌ వరలక్ష్మి రాంబాబు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ సుశీల, పీడీలు రామకష్ణ, సాంబశివరావు, సుదర్శన్‌, మునిశేఖర్‌, సురేంద్ర, నాగమల్లేశ్వరి, విజరు, పిఇటీలు చిరంజీవి, మనోహర్‌, గజేంద్ర, చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొదటి రెండవ స్థానాలు సాధించిన వారు చంద్రగిరిలో నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.