తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా యార్లపల్లి గోపి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: తిరుపతి నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా యార్లపల్లి గోపిని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఆదేశాలను అనుసరించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా యార్లపల్లి గోపిని నియమించారు. ఈ సందర్భంగా యార్లపల్లి గోపి మాట్లాడుతూ తాను 30 సంవత్స రాలుగా కాంగ్రెస్ కోసం పని చేశానని, మొదట 1993 ఎన్‌ఎస్‌యుఐ యువజన కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా, కోపరేటివ్ బ్యాంక్ నెంబర్, పిసిసి కార్యదర్శిగా పని చేశానని దీన్ని గుర్తించిన ఏఐసీసీ తనను తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించిందని తెలిపారు. ఈ పదవి తనకు రావడానికి కషిచేసిన మాజీ కేంద్ర మంత్రి, తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతా మోహన్‌కి, పీసీసీ అధ్యక్షులు రుద్రరాజుకి తన హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తాను కాంగ్రెస్ అభివద్ధికి తన వంతు కృషి చేసి 2024 లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.










