తిరుపతి మెడి సెంటర్ ప్రారంభం
ప్రజాశక్తి-తిరుపతి సిటి
తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ తిరుపతి మెడి సెంటర్ (టిఎంసి)ను తిరుపతి మేయరు డాక్టరు శిరీషా, డిప్యూటీ మేయరు భూమన అబినరురెడ్డి శుక్రవారం ప్రారంబించారు. స్థానిక శ్రీనివాసం కాంప్లెక్స్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆ బ్రాంచి వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాల జనరిక్ మందులు లభ్యమవుతాయన్నారు. ఔషదాల కొనుగోలుపై బారీ తగ్గింపు ఉంటుందని, రోగులు, వారి సహాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనహిత నిర్వహకులు, టిఎంసి అధినేత డాక్టరు రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇది 16వ బ్రాంచి అన్నారు. తిరుపతి నగరంలో ఇది 6వది అని, ఇక్కడ 2500 రకాల జనరిక్ మందులు, 50 రకాల సర్జికల్స్ వస్తువులు లభ్యమవుతాయన్నారు. 20 నుంచి 70 శాతం మేర జనరిక్ మందులుపై డిస్కౌంట్ కల్పిస్తున్నామన్నారు. మెంబర్‌షిప్ కార్డు సౌకర్యం కల్పిస్తున్నామని, దీని ద్వారా మరో 5శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చన్నారు. 8 సంవత్సరాలుగా ఔషదాల విక్రయాల్లో 8 లక్షల మంది వినియోగదారులకు పైగా మందులను విక్రయించామని గుర్తు చేశారు. టిటిడి, కార్పొరేషన్, సచివాలయ ఉద్యోగులకు సైతం సామాజిక సేవలో బాగంగా అదనపు డిస్కౌంట్ అందిస్తామన్నారు. ఈ అవకావాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేటర్ అమరనాథ్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మేన్ కేతం జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ప్రారంభిస్తున్న మేయర్ డాక్టర్ శిరీష










