Nov 03,2023 22:48

తిరుపతి ఎయిర్పోర్ట్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా పిసి రాయులు


తిరుపతి ఎయిర్పోర్ట్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా పిసి రాయులు
ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌
తిరుపతి విమానాశ్రయ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా పిసి రాయలును నియమిస్తూ శుక్రవారం కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి జ్యోతి రాధిత్య ఎం సింధియా.ఉత్తర్వులు జారీ చేశారు. కస్తూరిబా ట్రస్ట్‌ చైర్మన్‌ గా వ్యవహరిస్తున్న పిసీ రాయిలు తిరుపతి విమానాశ్రయ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పి సి రాయలు మాట్లాడుతూ ఈ పదవి తనకు ఇచ్చినందుకు కేంద్ర విమానాశ్రయ శాఖ మంత్రి జ్యోతి రాధిత్య ఏం సిందియా ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి విమానాశ్రయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.