Jul 05,2023 01:07
తిరుమలలో టిడిపి ఉమ్మడి జిల్లా నాయకులు

ప్రజాశక్తి-కనిగిరి: ఉమ్మడి ప్రకాశం జిల్లాల టిడిపి నేతలు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుండగా వారు పాల్గొనేందుకు తరలివెళ్లారు. ఈ నెలలో ప్రకాశం జిల్లాలో జరిగే పాదయాత్రపై లోకేష్‌తో నాయకులు మాట్లాడా రు. ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, టిడిపి నాయకులు, ఇన్‌చార్జ్‌లు నూకసాని బాలాజీ, ముత్తుముల అశోక్‌రెడ్డి, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్‌, ఏలూరి సాంభశివరావు తదితరులు పాల్గొన్నారు.