ప్రజాశక్తి - టి.నరసాపురం
మండలంలోని తిరుమలదేవిపేటలో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషను శిక్షణా కేంద్రాన్ని మధ్యాహ్నపువారిగూడెం సొసైటీ ఛైర్‌పర్సన్ దాసరి రాంబాబు చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు. 90 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ గ్రామీణ ప్రాంత మహిళలకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తపన ఫౌండేషన్ వాలంటీర్ శ్యామ్ సుందర్, దాకారపు సూరిబాబు, రెడ్డెం రమాదేవి, ఎం.హరిబాబు, కాంచనమాల, దామిశెట్టి కేశవరావు, తోట రామారావు, రామలింగేశ్వరావులు పాల్గొన్నారు.










