Oct 18,2023 22:52

తిరుచానూరు బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన .

తిరుచానూరు బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన .
ప్రజాశక్తి- తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల తర్వాత ఎంతో ప్రాధాన్యం కల పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్‌ 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్‌ఓ నరసింహ కిషోర్‌, ఎస్‌పి పరమేశ్వర్‌ రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, సివిల్‌ ఇంజినీరింగ్‌ వారు, పోలీస్‌ యంత్రాంగం బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి గుడి కి వచ్చే క్యూ లైన్‌ లను, మాడవీధుల్లో గల క్యూ లైన్‌ లను పరిశీలించి వివిధ శాఖాధిపతులకు తగు సూచనలిచ్చారు. ముఖ్యంగా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన ఘట్టమైన పంచమి తీర్థాలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా చక్రస్నానానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు ఎలా ఉండాలో తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వీజీవో నందకిషోర్‌ సివిల్‌ ఏఈ సురేష్‌, ఏవీఎస్‌ఓ సైలేంద్రబాబు, తిరుచానూరు సిఐ శివప్రసాద్‌ రెడ్డి ఎస్సైలు జగన్నాథ రెడ్డి, వెంకటసుబ్బయ్య, అసిస్టెంట్‌ విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఢిల్లీ బాబు, గౌతమి, విజిలెన్స్‌ సిబ్బంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు