May 28,2023 22:51

ప్రజాశక్తి - పెద్దాపురం పెద్దాపురం ఎడిబి రోడ్డు పాండవుల మెట్ట సెంటర్‌ వద్ద ఆదివారం ఎదురెదురుగా టిప్పర్‌, ఇథనాల్‌ ట్యాంకర్‌ ఢకొీన్న ప్రమాదంలో టిప్పర్‌లో మంటలు చెలరేగి టిప్పర్‌ డ్రైవర్‌ స్వల్పంగా గాయపడ్డాడు. మహారాష్ట్ర నుంచి కాకినాడ ఇథనాల్‌ తీసుకుని వెళుతున్న ట్యాంకర్‌, సామర్లకోట నుండి రాజమండ్రి వెళ్తున్న టిప్పర్‌ ఎదురెదురుగా ఢకొీన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌లోని ఆయిల్‌ ట్యాంకర్‌కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. టిప్పర్‌ డ్రైవరు స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. పెద్దాపురం, జగ్గంపేట అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పి వేశాయి. ఈ ప్రమాదంలో ఇథనాల్‌ ట్యాంకర్‌కు ఏ విధమైన ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.