టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం
టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం
ప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారికి మంగళవారం టివిఎస్ సంస్థ టివిఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ వాహనం ధర రూ.3లక్షల 5వేలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ఎండి టీటీడీ బోర్డు సభ్యులు సుదర్శన్ వేణు వాహనం తాళాలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. తిరుమల డిఐ జానకిరామ రెడ్డి, సంస్థ ప్రతినిధులు రాజారెడ్డి, భక్తవత్సలం, సిద్ధార్థ్ పాల్గొన్నారు.










