Jul 16,2023 21:22

మాట్లాడుతున్న శ్రీనివాసులు

కడప అర్బన్‌ : డిగ్రీ కళాశాలల పట్ల ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఫీజుల అంశం హై కోర్టు పరిధిలో ఉన్న దృష్ట్యా మంగళవారం న్యాయస్థానం తుది తీర్పును బట్ట భవిష్యత్తు కార్యారణ, విద్యా సంస్థల మనుగడ గురించి చర్చిస్తామని డిగ్రీ కళాశాలల అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం నాగార్జన డిగ్రీ కళాశాలలో వీవైయూ అనుబంధ డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల మనుగడపై చర్చించామని పేర్కొన్నారు. నిర్థారించిన ఫీజులు సమంజసంగా లేదని చెప్పారు. వాటిని మరోసారి పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేశారు. అడ్మిషన్లు 25 శాతం కంటే తక్కువ ఉన్న కళాశాలలను ముందస్తు సమాచారం లేకుండా 2023-24 విద్యా సంవత్సరానికి అనుమతి లేదంటూ (రాష్ట్ర వ్యాప్తంగా 30 కళాశాలలు) రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే అనుమతించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్‌, వైవీయూ ఇసి సభ్యులు సుబ్బారెడ్డి, కరస్పాండెంట్లు రామకృష్ణారెడ్డి, విజరు కుమార్‌, సాయికృష్ణ, నరసింహులు, సురేష్‌ పాల్గొన్నారు.