Oct 10,2023 23:45

తీరంగా గస్తీ కాస్తున్న కొత్తపల్లి పోలీసులు

ప్రజాశక్తి - యు.కొత్తపల్లి
సముద్రతీరంలో ఉగ్రవాదులు కదలికలు ఉన్నాయనేహెచ్చరిక నేపథ్యంలో తీరప్రాంతం వెంబడి ఆపరేషన్‌ ఆమ్లా(సాగర్‌ కవచ్‌) పేరుతో పోలీసులు నిఘా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉప్పాడ సముద్రతీరంలో ఉగ్రవాదులు సముద్ర తీరం గుండా పిఠాపురం సిఐ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు, కొత్తపల్లి ఎస్‌ఐ స్వామినాయుడు తన సిబ్బందితో నేమాం నుంచి కోనపాపపేట వరకు తీరం వద్ద నిఘా పెట్టారు. ప్రతి ఏడాది ఈ ఆపరేషన్‌ ఆమ్లా (సాగర్‌ కవచ్‌) పేరుతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తీర ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తారు. సముద్రంలో చేపలు వేటకు వెళ్ళే మత్యకారులకు ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవావ్లని పోలీసులు త ఎలిపారు. రెండురోజుల పాటు తీరంలో ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తామని తెలిపారు.దీని వల్ల సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవని ఎస్‌ఐ పేర్కొన్నారు.