Jan 30,2023 23:15

సన్నివేశాలపై చర్చిస్తున్న సినీ ఆర్టిస్టులు

ప్రజాశక్తి -మధురవాడ : భీమిలి బీచ్‌ రోడ్‌, ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లో సోమవారం సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. దర్శకుడు వీరభద్రం చౌదరి తెరకెక్కిస్తున్న దిల్‌ వాలా సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. హీరో నరేష్‌ అగస్తా, హీరోయిన్‌ శ్వేత నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌, లహరి, ఆలీ రాజా, అవినాష్‌ నటిస్తున్నారు. నభిషేక్‌, నరసింహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ సంగీతం అందిస్తున్నారు. మరో వారం రోజులు పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు దర్శకుడు వీరభద్రం చౌదరి తెలిపారు.