భీమిలి బీచ్ వద్ద ఏర్పాటుచేసిన పోలీసు హెచ్చరిక బోర్డు
ప్రజాశక్తి -భీమునిపట్నం : భీమిలి సముద్రపు ఒడ్డున స్థానిక పోలీసులు హెచ్చరిక బోర్డును మంగళవారం ఏర్పాటుచేశారు. సముద్రంలో స్నానానికి దిగి ఇటీవల ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతవ్వగా, ఒకరి మృతదేహం లభ్యమైన విషయం విదితమే. ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ''ఇచ్చట సముద్ర స్నానం చేయుట ప్రమాదకరం, సందర్శకులు సముద్రంలో దిగరాదు' అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సిఐ కె.లక్ష్మణమూర్తి, ఎస్సై జి హరీష్, జోనల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేశారు










