Jul 27,2023 23:05

ఒడ్డుకు చేరిన నీలి తిమింగళం

ప్రజాశక్తి - సంతబొమ్మాళి: మండలంలోని పాత మేఘవరం, డి.మరువాడ మధ్యన సముద్రతీరానికి భారీ నీలి తిమంగళం (బ్లూ వేల్‌) గురువారం కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగుల పొడవుతో ఐదు టన్నుల బరువు ఉంది. భారీ తిమింగళం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సమీప ప్రాంతాల ప్రజలు చూడడానికి తరలివచ్చారు.