Dec 30,2022 23:17

            కాలగమనంలో మరో సంవత్సరం కనుమరుగు కానుంది.. గతం ఒక జ్ఞాపకం.. అనుభవం.. గుణపాఠం.. అటువంటి ఎన్నో అనుభూతులు.. షడ్రుచుల సమ్మేళనమే 2022 సంవత్సరం. ఈ కాలంలో ఎన్నో విషాధ ఘటనలు చోటుచేసుకున్నాయి.. మరువలేని మధుర స్మృతులు ఆవిష్కృతమయ్యాయి. వాటిలో ముఖ్య ఘట్టాలను మరోసారి అవలోకనం చేసుకుందాం.
పందేల జోరు.. పోరాటాల హోరు..్య్
జనవరి: సంక్రాంతి ముసుగులో జిల్లాలో జోరుగా కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. మూడు రోజులపాటు యథేచ్ఛగా సాగిన పందేల్లో వందల కోట్ల సొమ్ము చేతులు మారింది. పోలీసు శాఖతోపాటు రెవెన్యూ అధికారులు సైతం ఆ మూడురోజులు పత్తాలేకుండా పోవడం గమనార్హం.
జీతాలకు కోతపెట్టే పిఆర్‌సి వద్దంటూ ఫ్యాప్టో ఆధ్వర్యాన ఆందోళనలు మిన్నంటాయి. జిల్లా కలెక్టరేట్‌ను దిగ్బంధనం చేశారు. ప్రొబేషన్‌ ఖరారు చేసి, వేతన సవరణ చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
నిరాశ.. నిరసనల్య్య్యు
ఫిబ్రవరి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులు లేకపోవడంతో జనం నిరాశకు గురయ్యారు. విద్యుత్‌ కోతలపై అన్నదాతలు రోడ్డెక్కారు. ఫ్యాప్టో పిలుపు మేరకు రివర్స్‌ పిఆర్‌సికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగాయి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని విద్యార్థి, యువజన సంఘాల చలో కలెక్టరేట్‌ను పోలీసులు భగం చేశారు. జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని ప్రకటించాలని ఐకాస ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సిద్ధాంతం, మార్టేరు, పాలకొల్లు మీదుగా నరసాపురం వరకూ రోడ్డుషో నిర్వహించారు.
ఊరట.. కలవర్య్య్యం
మార్చి: యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న జిల్లాకు చెందిన తణుకు, నరసాపురం, ఉండి తదితర ప్రాంతాలకు చెందిన వైద్య విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు ఊరట చెందారు. సర్‌ సిఆర్‌రెడ్డి కళాశాల 75 వసంతాల వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో మూడు రోజుల్లో 16 మంది కల్తీసారా తాగి మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. మృతుల కుటుంబాలను టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన, వామపక్షాల నేతలు పరామర్శించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది.
కొత్త జిల్లాలు.. మంత్రులు..
ఏప్రిల్‌: కొత్త జిల్లాలు కొలువ య్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాగా ఏర్పాటయ్యాయి. కొంతభాగం తూర్పుగోదావరి జిల్లాలో కలిసింది. పశ్చిమగోదావరి జిల్లా మంత్రులిద్దరికీ కీలక శాఖలు దక్కాయి. ఉప ముఖ్యమంత్రిగా, దేవదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖా మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని గొల్లపల్లిలోని స్పిన్నింగ్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.30 కోట్ల విలువైన పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఫోరస్‌ రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలోనూ టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ జిల్లాలో పర్యటించారు.
అకాల వర్షం.. రైతన్నకు కష్టకాలం..
మే: ఉమ్మడి జిల్లాలో ఈ నెలలో రెండు దఫాలుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. గణపవరంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటించారు. గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరిలో కలపుతామని ప్రకటించారు.
ఆందోళనల పర్వం..
జూన్‌: జిల్లాలో 46 ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. పరిహారం పెంచే వరకూ పనులు సాగనివ్వబోమని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నిరసన బాట పట్టారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయిలో 12వ స్థానం లభించింది. 57.55 శాతానికి ఉత్తీర్ణత పడిపోయింది.
గోదావరి వరద కష్టాలు..
జులై: అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవం సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోడీతోపాటు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సిఎం జగన్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. గోదావరికి అనూహ్యంగా వచ్చిన భారీ వరదలతో విలీన మండలాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. విలీన మండలాల్లో జనం గుట్టలపై తలదాచుకోవాల్సిన దుస్థితి దాపురించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న గర్భిణులను హెలికాప్టర్‌లో తరలించారు. ఈ నెలలోనూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
విషాద కాలం.్య్య్య
ఆగస్టు : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. లింగపాలెం మండలం భోగోలులో పిగుడుపాటుకు నలుగురు వలస కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గణపవరం మండలం వల్లూరులో విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీట్టిన కారు అదుపుతప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెనుమంట్ర మండలం గరువులో ఒక ఇంట్లో దొంగలు పడి భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు అపహరించారు.
రెబెల్‌స్టార్‌ కన్నుమూత ్య్య్య
సెప్టెంబర్‌: నటనాకౌశలంతో నలభై ఏళ్లు పైబడి వెండితెరపై వెలిగిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మృతి అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచింది. కేంద్ర మంత్రి హోదాలో జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని జనం స్మరించుకుంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. సిపిఎస్‌ రద్దు చేయాలంటూ జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. సెప్టెంబర్‌ 1న సిపిఎస్‌ విద్రోహ దినం పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది.
చోరులను పట్టేశారు..్య్య్య
అక్టోబర్‌ : రూ.22 లక్షల విలువైన 105 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు. భీమవరం పట్టణంలోని బిసి బాలుర కళాశాల వసతి గృహానికి చెందిన 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆకివీడులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
మృత్యు ఘోష..
నవంబరు :ఏలూరు మండలం కలకుర్రులో చేపల చెరువుల పనికి వెళ్లిన ఇద్దరు మహిళా కూలీలు తిరిగొస్తుండగా పడవ బోల్తా పడి మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడుతో ముగ్గురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాతో విడదీయలేని బంధం ఉన్న సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూశారు. నరసాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సిఎం జగన్‌ నిర్వహించారు. పెదవేగి మండలం కూచింపూడి జెడ్‌పి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 11 మంది, పాలకోడేరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు.
ప్రాణాలు తీసిన పేలుళ్లు..
డిసెంబర్‌: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ ఛానల్‌లో పడవ బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ప్రతిపాడులోని ఫుడ్‌ ప్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ (3ఎఫ్‌) కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదంచోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు సజీవదహనమయ్యారు.