Mar 05,2023 00:52
మాట్లాడుతున్న అతిథులు

ప్రజాశక్తి-బాపట్ల: టీజింగ్‌ వంటి సమస్యలు ఎదురైనప్పుడు విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏ ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. మహిళా విద్యార్థు లకు ఏ చిన్న సమస్య ఎదురైనా మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉమెన్‌ ప్రొటెక్ష న్‌ సెల్‌ను ఆశ్రయించి తక్షణరక్షణ పొందాల న్నారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ చైర్‌పర్సన్‌ సిహెచ్‌ చిరంజీవి వ్యవసాయ కళాశాల ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ చైర్మన్‌ వి ప్రసన్న కుమారి, కళాశాల అసోసియేట్‌ డీన్‌ వి శ్రీనివాసరావు, టి మధుమతి, కంట్రోలర్‌ అఫ్‌ ఎగ్జామ్స్‌ పి సుధాకర్‌, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ సభ్యులు కె హేమ, సిహెచ్‌ మహాలక్ష్మి, సుజాత, వి ప్రసన్న కుమారి, బోధన, బోధనేతర మహిళా సిబ్బంది పాల్గొన్నారు.