Aug 25,2023 21:51

్ట కండువాలు కప్పుతున్న దినేష్‌రెడ్డి

్ట కండువాలు కప్పుతున్న దినేష్‌రెడ్డి
టీడీపీలో చేరిన వైసిపి కార్యకర్తలు
ప్రజాశక్తి-కొడవలూరు:కోవూరు టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా మండల నాయకులతో కలిసి గ్రామంలో ప్రజా పోరుబాట చేపట్టారు. గ్రామానికి చేసిన పోలంరెడ్డి దినేష్‌ రెడ్డికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పంచాయతీకి మిక్స్డ్‌ కాలనీ చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు వైసిపినీ వీడి టీడీపీ మండల నాయకులు ఆధ్వర్యంలో పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు,

పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పాత కొత్త అనే బేధాలు లేకుండా సముచిత స్థానం కల్పిస్తామని టిడిపి కుటుంబ సభ్యులుగా అందరం కలిసిమెలిసి పార్టీ గెలుపు కోసం కషి చేద్దామని తెలిపారు. సందర్భంగా పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు వైసిపి ప్రభుత్వంపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రసన్నకుమార్‌ రెడ్డికి సమస్యలు తెలుపుతుంటే పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకున్న ప్రభుత్వం టిడిపి ప్రభుత్వమనీ తెలిపారు. వైసిపి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కష్ణ చైతన్య, ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర, నాయకులు నక్క రమణయ్య, గుంజి శ్రీనివాసులు, చెక్కా మదన్‌, బద్వేలు వినీల్‌ రెడ్డి, వీరేంద్ర చౌదరి, మాజీ ఎంపీటీసీ పట్రా శ్రీనివాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.