Sep 11,2023 00:13

ప్రజాశక్తి - రేపల్లె
టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి శ్రేణులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిడిపి మండల అధ్యక్షులు రేపల్లె రామాంజనేయులు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. టిడిపి సీనియర్‌ నాయకులు జీవి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని ఆరోపించారు. సంఘం డైరీ డైరెక్టర్ నర్రా వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అరాచక పాలన నడుస్తుందని అన్నారు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. పోలీసులు నియమ, నిబంధనలకు లోబడి వ్యవహరించాలని కోరారు. జగన్‌ పాలనపై విసుగెత్తిన ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. దీక్షలో కె రాము, మేక శివరామకృష్ణ, పంతాని మురళిధరరావు, కె వెంకటేశ్వరరావు, అనగాని శివ ప్రసాద్, చింతారావు, యాలవర్తి లక్ష్మీ, గౌరీ రామకుమారి, సుబ్రహ్మణ్యం, టీడీపీ లీగల్ సెల్ నాయకులు ధర్మతేజ పాల్గొన్నారు.