చెక్కు అందజేస్తున్న కార్పొరేటర్ ముర్రు వాణి
ప్రజాశక్తి -కంచరపాలెం : జివిఎంసి 57వ వార్డులో టిడ్కో ఇళ్లు కోసం గత టిడిపి ప్రభుత్వం హయాంలో డిడిలు కట్టిన లబ్ధిదారులకు డబ్బులు వాపసు చేశారు. ఈ మేరకు చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు కార్పొరేటర్ ముర్రు వాణి సోమవారం అందజేశారు. అప్పట్లో టిడ్కో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు డీడీల చెల్లించగా, తర్వాత ప్రభుత్వ మారడంతో చోటుచేసుకున్న మార్పులు నేపథ్యంలో కొందరిని అనర్హులుగా చేర్చారు. అయితే అప్పట్లో వారు కట్టిన డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో వైసిపి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనందకుమార్ చొరవతో అధికారులు స్పందించి అప్పట్లో కట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేశారు. కార్యక్రమంలో సిఒ నారాయణరావు, వెల్ఫేర్ సెక్రెటరీ కృష్ణ పాల్గొన్నారు










