Apr 20,2023 20:07

సెల్ఫీ ద్వారా ప్రభుత్వానికి సవాలు విసురుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
టిడ్కో గృహాలను పేదలకు ఎందుకు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలోని పేదలు, నిరాశ్రయుల సొంతింటి కలను నిజం చేయాలనే ఏకైక సంకల్పంతో టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన 7 వేల టిడ్కో (జిప్లస్‌3) గృహాలను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గురువారం ఆయన వైసిపి ప్రభుత్వానికి సెల్ఫీ ద్వారా సవాలు విసిరారు. అలాగే టిడిపి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు, చేనేత కళాకారులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బనవాసి సమీపంలో 96 ఎకరాల్లో మంజూరు చేసిన టెక్స్‌ టైల్స్‌ పార్కు ఎక్కడా అని ప్రశ్నించారు.