Apr 26,2023 23:56

టిడ్కో గృహాలను చూపుతున్న నాగజగదీశ్వరరావు

ప్రజాశక్తి- అనకాపల్లి : తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను పేదలకు పంపిణీ చేయాలని టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లయినా నేటికీ ఇళ్లను కేటాయించకపోవడం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. బుధవారం ఆయన టిడ్కో గృహాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యనారాయణపురం పంచాయతీలో 2520 గృహాలను టిడిపి నిర్మించిందని, వాటికి వైసీపీ ప్రభుత్వం రంగులు వేసింది తప్ప అర్హులైన లబ్ధిదారులకు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి లబ్ధిదారులకు ఇళ్లు అందే వరకు పోరాటం చేస్తామన్నారు.