Aug 17,2022 23:17

టిడ్కో ఇళ్ల ప్రాంతంలో పర్యటిస్తున్న జివిఎంసి కమిషనర్‌ లకీëశ

ప్రజాశక్తి- కలెక్టరేట్‌, విశాఖ : టిడ్కో హౌసింగ్‌ గృహాలకు తక్షణమే విద్యుత్‌ మీటర్లు, కనెక్షన్లు అందజేయాలని యుసిడి పీడీ పావునాయుడును జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం జోన్‌ -4లోని 35, 39 వార్డుల పరిధిలోని సీహార్స్‌ జంక్షన్‌, చిలకపేట ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్ళను కమిషనర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిలకపేటలో ఉన్న 64 టిడ్కో గృహ సముదాయాల్లో ఇప్పటికే 37 మంది, సీహార్స్‌ జంక్షన్‌లోని 72 ఇళ్లకు 25మందికి బ్యాంకులతో రుణాలు మంజూరు చేయించామన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మౌలిక వసతులు కూడా పూర్తి చేశామని, మిగిలిన వారికి కూడా అన్ని అనుమతులతో త్వరలోనే ఇళ్లు అప్పగించాలని ఆదేశించారు.