
టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్
ప్రజాశక్తి - యలమంచిలి
ఎపి టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు అవసరమైన నిత్యావసర సరుకుల కోసం మార్కెట్‌కు వెళ్లకుండా ఇక్కడే సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ హామీ ఇచ్చారు. శనివారం మున్సిపల్ కమిషనర్ వీరయ్యతో కలిసి ఆయన లబ్ధిదారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేయబోయే మహిళా సూపర్ బజార్‌లో బయట మార్కెట్ రేట్ల కంటే 15 శాతం తక్కువకే దొరుకుతాయని తెలిపారు. సూపర్ బజార్ నిర్వహణ కూడా ఇక్కడి మహిళలే సంఘటితంగా చేపడతారని చెప్పారు. చిన్న చిన్న సమస్యలన్నీ ఈ నెలాఖరు నాటికి తీరుతాయన్నారు. ఇళ్లు పూర్తిస్థాయిలో స్వాధీనం అనంతరం సామూహికంగా బంధు, మిత్రులను ఆహ్వానించి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కావ్వ, శ్రీను పాల్గొన్నారు.