Jul 24,2023 23:37

నిరసన తెలియజేస్తున్న సిపిఐ నాయకులు


ప్రజాశక్తి-రేపల్లె :
టిడ్కో గహాల నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని టిడ్కో గహాల సాధన కమిటీ నాయకులు పి.నాగాంజనేయులు, గొట్టుముక్కల బాలాజీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టణంలో గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన టిడ్కో గహాల నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు గహాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ టిడ్కో గహాల సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగాంజనేయులు, బాలాజీలు మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరుతుందన్న ఆశతో టిడ్కో గహాల కోసం అప్పులు చేసి వేలాది రూపాయలను డీడీల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే ఇల్లు రాకపోగా చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో లబ్ధిదారులు మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకొని టిడ్కో గహాల నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని లేకుంటే రానున్న రోజుల్లో దశల వారి ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాధన కమిటీ నాయకులు దాసరి సాంబశివరావు, కె. వెంకట సుబ్బారావు, కొడాలి సాంబశివరావు, శ్రీరావమ్మ, ముసలయ్య, చంద్రశేఖర్‌, డి. ప్రకాశరావు, తలశిల సత్యనారాయణ, ఎం. కోటేశ్వరి, విజయ, బొలిశెట్టి సత్యనారాయణ, వసంత తదితరులు పాల్గొన్నారు.