Aug 08,2023 20:54

ప్రజాశక్తి - కాళ్ల
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపిని తిరిగి అధికారంలోకి తేవాలని టిడిపి బిసి సాధికారత సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరవల్లి శ్రీనివాస్‌ అన్నారు. బొండాడపేట గ్రామంలో టిడిపి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక వసతులు విస్మరించి రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాల్జేస్తోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని తరగతుల ప్రజలకూ న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, గ్యాస్‌ ధరలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వంలో పెంచిన పన్నులు కట్టలేక ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జివి.నాగేశ్వరరావు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి తోట ఫణిబాబు, మాజీ సర్పంచి దాసరి వెంకటరామరాజు, ఉప సర్పంచి గుడ్ల మధుసూ దనరావు, కె.వెంకట్రావు, తెలుగుమహిళలు టి.లీలావతి, మాజీ వైస్‌ ఎంపిపి కాలవ లక్ష్మి, పోతుల పద్మకుమారి పాల్గొన్నారు.