Nov 04,2023 20:56

కలకడ : ఇంటింటి ప్రచారంలో రమేష్‌కుమార్‌రెడ్డి

కలకడ : భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి ఆర్‌ రమేష్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. సంబేపల్లి మండలం ఎస్‌.సోమవరం పంచాయతీ అగ్రహారంలో ఇల్లు తిరిగి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టిడిపి చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. టిడిపి మినీ మెనిఫెస్టోను ప్రజలకు వివరించి చెప్పారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి వైసిపి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తులో వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అక్రమంగా చంద్రబాబుపై కేసులు బనాయించి జైల్లో ఉంచనంతమాత్రాన ప్రజా ఆదరణకు లోటు లేకుండా పోయిందని, వచ్చే ఎన్నికల్లో వైసిపిని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో నరసారెడ్డి ,వేణుగోపాల్‌, రెడ్డయ్య, రవికుమార్‌, రాహుల్‌ ,శ్రీనివాసులు, నాగార్జునరెడ్డి, అభిషేక్‌, రాజశేఖర్‌ నాయుడు, నారా ప్రభాకర్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, సుబ్బరాజు, గోపినాథ్‌రెడ్డి, సాయికాంత ్‌కుమార్‌ పాల్గొన్నారు. పుల్లంపేట : మండల పరిధిలోని రెడ్డిపల్లి పేట గ్రామంలో రైల్వే కోడూరు టిడిపి ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనా థనాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఇంటింటికి తిరిగి నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌ నాయుడు, ఉపాధ్య క్షులు కాపెర్ల చంద్రశేఖర్‌ నాయుడు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ పోలి జగదీశ్వర్‌ రెడ్డి, బూత్‌ ఇన్‌ఛార్జి సుబ్బన్న, తెలుగు మహిళ అనిత దీప్తి పాల్గొన్నారు.