
ప్రజాశక్తి బత్తలపల్లి : జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఇలాంటి పరిస్థితుల్లో టిడిపితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన బత్తలపల్లి మండల కేంద్రంలో గురువారం పర్యటించారు. బత్తలపల్లిలోని మైనారిటీ కాలనీ, కురుబ కాలనీ, పాత ఊరు, బోయ వీధి తదితర కాలనీల్లో ఆయన పర్యటించారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రతిరోజు 'గుడ్ మార్నింగ్' చేస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. కనీసం డ్రైనేజీ సమస్యలు కూడా పట్టించుకునే వారు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, జక్కంపూటి నాగభూషణం, రంగా నాయుడు, బోయపాటి అప్ప స్వామి నాయుడు, ఎల్‌ఎస్ సుభాన్, టైలర్ రఫీ, సులేమాన్, గుండుసాబ్, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిల్ రావటంపై టిడిపి 25వ వార్డు ఇన్‌ఛార్జి భీమనేనిప్రసాద్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని 25వ వార్డు లక్ష్మీ చెన్నకేశవపురంలో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గడ్డంసూరి, క్లస్టర్ రామాంజి, రేనాటిబాబు, బాషా తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : టిడిపి రూపొందించిన మినీ మేనిఫెస్టోను బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిడిపి నాయకులు సూచించారు. ఈ మేరకు టిడిపి నాయకులు మండలకేంద్రంలో సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ బాబు, ప్రభాకర్ నాయుడు, తుమ్మల మనోహర్, కృష్ణమూర్తి యాదవ్, నాగలగుబ్బ శేఖర్, తుమ్మల సూరితో పాటు మండలంలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.