Nov 01,2023 23:00

ప్రజాశక్తి - చీరాల
టిడిపితోనే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు లభిస్తుందని టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక 10వ వార్డులో ఆయన ఇంటింటికి భవిష్యత్ గ్యారెంటీ టిడిపి పథకాలను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, తమ జీవితాలు బాగుపడతాయని మహిళలు అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గుత్తికొండ వెంకయ్య, టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ్రు రత్నబాబు, ఐటీడీపీ ప్రెసిడెంట్ బిట్రా చైతన్య కుమార్, సీనియర్ నాయకులు నరాల తిరుపతి రాయుడు, అవ్వారు సాంబయ్య, విష్ణుమొలకల మధుబాబు, దగ్గుబాటి వెంకటరావు, కౌతరపు జనార్దనరావు, దగ్గుబాటి వెంకటరావు, బిసి సెల్ అధ్యక్షులు అంగిరేకుల వెంకటేశ్వరరావు, విన్నకోట జగదీష్, తోట సాంబశివరావు, పృధ్వి రామారావు, కోసూరి శ్రీనివాస్, గుంటూరు మల్లిఖార్జున పాల్గొన్నారు.