
ఎంఎల్‌ఎ మంతెన రామరాజు
ప్రజాశక్తి - కాళ్ల
మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యమని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. ఏలూరుపాడు గ్రామంలో టిడిపి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతోపాటు పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, ఇంటి, చెత్త పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని తరగతుల ప్రజలకూ న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు డ్వాక్రా తీసుకొచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేసిన ఏకైక పార్టీ టిడిపి అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే యువతకు ఏటా రూ.36 వేలు అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆర్ధికంగా ఆదుకుంటామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండలాధ్యక్షుడు జివి.నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్‌ఛార్జి తోట ఫిణిబాబు, కాలువ లక్ష్మి వెంకట్రావు, టి.లీలావతి, మాజీ సర్పంచి మంతెన ఆంజనేయరాజు పాల్గొన్నారు.