Nov 08,2023 21:57

పాచిపెంట.. పార్టీలో చేరిన వారికి టిడిపి కండవాలు కప్పుతున్న పొలిట్‌బ్యూరో సభ్యులు సంధ్యారాణి

ప్రజాశక్తి-పాచిపెంట : టిడిపితోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మండలంలో బొర్రమామిడి, సతాబి, గొట్టూరు గ్రామాల్లో బుధవారం బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి పాలనలో గిరిజన గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి, చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో గిరిజనుల జీవనం కష్టతరంగా మారిందన్నారు. అనంతరం వైసిపి నుండి 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వారికి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముఖి సూర్యనారాయణ, గూడెపు యుగంధర్‌, పల్లేడ ఉమా మహేశ్వరరావు, పూసర్ల నర్సింగరావు, దండి మోహనరావు, మాదిరెడ్డి మజ్యరావు తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో మర్రిపాడు పంచాయతీ పెదబగ్గ గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి సీనియర్‌ నాయకులు పడాల భూదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మినీ మేనిఫెస్టోపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాలలో తాగుమీరు, రహదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బిడ్డిక జయలక్మి, ఎంపిటిసి ప్రతినిధి బిడ్డిక చిలకమ్మ, మాజీ వైస్‌ సర్పంచ్‌ ఆరిక మాలయ్య, సీనియర్‌ నాయకులు సవర మంగయ్య, బిడ్డిక రామకృష్ణ, సవర వెంకటరావు, సవర పెంటయ్య, నిమ్మక బాలరాజు, నిమ్మక గంగయ్య, మహిళలు,యువత పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి సర్కారు.. రైతులనే నట్టేట ముంచే విధంగా వ్యవహరించడం బాధాకరమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరుచంద్ర అన్నారు. రైతులను ఆదుకోలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని సంగంవలసలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. నీరు లేక ఎండిపోయిన వరి పంటను టిడిపి బృందం పరిశీలించింది. ఈ మేరకు రైతులు టిడిపి బృందం ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వర్షాలు కురవక, నీటి ఆధారం లేక తమ పొలాలు ఎండిపోయాయని, ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజరు చంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితి అంచనా వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉండగా, బస్సు యాత్రల పేరిట ప్రజలను ఏమార్చేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గొరజాన చంద్రమౌళి, కార్యదర్శి గొరజాన చంద్రమౌళి, అమరాపు రామకృష్ణ, గుంట్రెడ్డి ఉదరు, మూడడ్ల అప్పలనాయుడు, గంట కృష్ణారావు, పోల సత్యనారాయణ, రెడ్డి సింహాచలంనాయుడు , బుడితి శ్రీరాము, రెడ్డి శివ, వడ్డి చంటి, టిడిపి సీనియర్‌ నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, బార్నాల సీతారాం తదితరులు పాల్గొన్నారు.
భామిని : వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయని టిడిపి నియోజకవర్గ పరిశీలకులు కలమట సాగర్‌ తెలిపారు. భామినిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. పంటలు ఎండిపోతున్నా వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసే పరిస్థితి లేదన్నారు. పంటల పరిస్థితిపై స్థానిక ప్రజాప్రతినిధులు సమీక్షించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భామినిని కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మండలంలో ప్రధానరహదారి గోతులమయంగా ఉందని, ఆర్‌అండ్‌బి చేయాల్సిన పనిని.. పోలీస్‌ అధికారులు మట్టితో గోతులు కప్పుతున్నారని చెప్పారు. అనుమతులు లేకుండా చిదిమి రోడ్డుకు ఎలా శంకుస్థాపన చేశారో అర్థం కావడం లేదన్నారు. గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేవని గడపగడపకు కార్యక్రమంలో ప్రశ్నిస్తే గొంతు నొక్కే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు రవినాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరావు, నాయకులు బిడ్డికి ప్రసాద్‌, లోపింటి రాజేష్‌, సాకేటి రామారావు, గురిబిల్లి లకీëపతినాయుడు, కోరాడ రాజేష్‌, క్రిష్ణ చంద్ర దొర పాల్గొన్నారు.