ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తేనే గిరిజన బతుకుల్లో వెలుగులు ఉంటాయని కురుపాం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని మారుమూల ప్రాంతమైన రాయగడ జమ్ము పంచాయతీ లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అనంతరం పెదరావికోన, పాముల గీసాడ, పెంగవ, గొరడ, రేగిడి గ్రామాల్లో బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అడ్డాకుల నరేష్, దాసు, భూపతి దొర, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
టిడిపి లోకి 50 కుటుంబాలు చేరిక
సీతంపేట : మండలంలోని కిండంగి పంచాయతీ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరికి పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సవరతోట మొఖలింగం, క్లస్టర్ ఇన్‌ఛార్జి నిమ్మక చంద్రశేఖర్, ఐటిడిఎ కోఆర్డినేటర్ హిమరిక పవన్, నిమ్మక కాంతారావు, సవర అనిల్, వివిధ గ్రామాల పెద్దలు, మహిళలు, మండల ముఖ్య నాయుకులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని నాగూరులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు అక్కేన మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి కె.చంద్రశేఖర్, బూత్ ఇన్‌ఛార్జి ఎ.జనార్దన్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.