Aug 01,2023 00:54
నాగరాజుపాలెం గ్రామంలో ప్రజలతో బాపట్ల టిడిపి బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ

ప్రజాశక్తి-కర్లపాలెం: తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలోని ప్రజల భవితకు భరోసా లభిస్తుందని టిడిపి బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ప్రతి ఇంటికీ తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం, మీ మాట-నా బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం కర్లపాలెం మండలంలోని నాగరాజుపాలెం గ్రామంలో నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ విధానాలను వివరిస్తూ మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ వారికి చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని, టిడిపి ఇటీవల ప్రకటించిన మినీ మెనిఫెస్టో, భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు అందజేసి ఆశీర్వదించాలని కోరారు. ముందుగా గ్రామంలో ఉన్న దర్గాలో ఇమామ్‌లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి కార్యక్రమం ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామపెద్దలు చెప్పిన సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల నాయకులు, నాగరాజుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.