Sep 06,2023 00:41

ప్రజశక్తి - చీరాల
రాష్ట్ర అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని టిడిపి ఇంచార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. పట్టణంలోని పేరాల 3వ వార్డ్ మసీదు సెంటర్ నుండి టిడిపి మిని మేఫెస్టోలో ప్రకటించిన పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాలను అందిస్తామని అన్నారు. నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. ప్రజలను అడిగి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొండ్రు రత్నబాబు, కాగిత మంగపతి, యాతం విజయ్, షేక్ మొహిద్దిన్, గంజి పురుషోత్తం, పులిపాటి శేఖర్ బాబు, కౌతరపు నాగేశ్వరి, షేక్ ఫర్వాన, గుద్దంటి శివలీల, గుంటి మల్లికార్జున, షేక్ అజీమ్, బోయిన శ్రీనివాసరావు, కౌతరపు జనార్ధనరావు, షేక్ రబ్బానీ పాల్గొన్నారు.