Aug 09,2023 22:11

ప్రజాశక్తి - కాళ్ల
బిసిల అభ్యు న్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. మండలంలోని జక్కరంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంతెన రామరాజు ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతోపాటు పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, గ్యాస్‌ ధరలు, ఇంటి, చెత్త పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన ఆరో వార్డు పంచాయతీ బోర్డు మెంబర్‌ ముత్యాలపల్లి గంగాసూరమ్మ, నవీన్‌ దంపతులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండలాధ్యక్షుడు జివి.నాగేశ్వరరావు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.
      ఆచంట :ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మండలంలోని వల్లూరులో ఆయన బుధవారం ప్రారంభించారు. ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.