Nov 15,2023 21:59

కొమరాడ : విక్రమపురంలో ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు జగదీశ్వరి

ప్రజాశక్తి - కొమరాడ : రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని విక్రంపురంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు దేవకోటి వెంకట నాయుడు ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టిడిపి అమలు చేస్తున్న మినీ మేనిఫెస్టోను వివరించారు. అనంతరం వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు జరిగిన మోసం, అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. మండలంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న వంతెనతో పాటు జంఝావతి, వనకాబడి ప్రాజెక్టుల సమస్యలు తరతరాలుగా ఉన్నాయన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటి పూర్తికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్‌ శేఖర్‌ పాత్రుడు, నాయకులు సుదర్శనరావు, మధుసూదనరావు, తదితరులు ఉన్నారు.
సాలూరురూరల్‌: మండలంలోని ఖరాసువలస, గుర్రప్పవలస, కొమ్మన్నవలస, దట్టివలస గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందించబోయే పథకాలు గురించి కరపత్రాల ద్వారా ఇంటింటికి వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, డొంక అన్నపూర్ణ, యుగంధర్‌, ఎంపిటిసి సభ్యులు రమాదేవి, శ్రీను పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో దబరలో పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష,్ణ మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జయకష్ణ మినీ మేనిఫేస్టోలోని సూపర్‌ సిక్స్‌ అంశాలను వివరిస్తూ ఖచ్చితంగా చంద్రబాబు మళ్లీ సిఎం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమం సవర రవి, సవర సంజరు, సవర శంకర్‌, సాయి, సవర బాలరాజు, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు.