Jul 19,2023 16:41

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్న టిడిపి నాయకులు

టిడిపిని వీడి 13 కుటుంబాలు వైసీపీలో చేరిక
ప్రజాశక్తి - బనగానపల్లె

        పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన 13 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైసిపి లో చేరారు.. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన టిడిపి పార్టీకి చెందిన కె.మదన గోపాల్, తెలుగు గోవర్ధన్ ,తెలుగు సుబ్బరాయుడు, తెలుగు వెంకటసుబ్బయ్య, నర్సిపల్లి సంటేన్న, తెలుగు వెంకటేశ్వర్లు, తెలుగు శ్రీనివాసులు, తెలుగు బాల హుసేని, నాగమద్దిలేటి, తెలుగు వర్ధన్ ,తెలుగు పెద్ద వెంకటేశ్వర్లు,వార్డు మెంబర్ తెలుగు బాలనాగన్న , తెలుగు సుబ్రహ్మణ్యం లు వైసీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి వైసీపీలో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి  అందుతున్నాయని వాటికి ఆకర్షితులై  టిడిపి పార్టీ నుంచి వైసీపీలో చేరినట్లు తెలిపారు .  పార్టీలో చేరుతున్న వారికి తమ పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తానని తెలిపారు. వచ్చే 2024వ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ లో 175 కి 175 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వేములపాడు గ్రామ  మాజీ సర్పంచు చిందుకూరి సురేష్ కుమార్, చిందుకూరి సుబ్రహ్మణ్యం, వైసిపి నాయకులు చిందుకూరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.