Jul 04,2023 01:17
ప్రజలతో మమేకమైన వేగేశన నరేంద్రవర్మ

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ అన్నారు. సోమవారం బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారి పాలెంలో ఇంటింటికీ తెలుగుదేశం, మీ మాట - నా బాట కార్యక్రమాన్ని నరేంద్రవర్మ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' మ్యానిఫెస్టో ప్రచారంలో భాగంగా గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ విధానాలను వివరించారు. మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచితోపాటు పార్టీ విధానాలతో పాటు నియోజకవర్గంలో తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల వివరాలు భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. తొలుత పార్టీ నాయకులు భారీ ర్యాలీతో నరేంద్రవర్మకు స్వాగతం పలికారు. గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన నరేంద్రవర్మ నివాళులర్పించి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో మహిళలు హారతులు పడుతూ నరేంద్రవర్మకు ఘన స్వాగతం పలికారు.