Jul 14,2023 19:21

సమస్యలు తెలుసుకుంటున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
వచ్చే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గ్రామగ్రామాన పర్యటిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. శుక్రవారం మండలంలోని సలకలకొండ, దిబ్బనకల్లు, అలసందగుత్తి గ్రామాల్లో ప్రర్యటించి నాయకులతో చర్చించారు. దీబనకల్లు గ్రామంలో సర్పంచి భర్త లక్ష్మన్న, టిడిపి నాయకులు సోమశేఖర్‌, సలకలకొండ గ్రామంలో టిడిపి నాయకులు ప్రతాప్‌, మాజీ సర్పంచి ఆంజనేయులు, అలసందగుత్తి గ్రామంలో మునెయ్య, ఉరుకుంద రెడ్డిని కలిసినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, మార్కెట్‌ యార్డు మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఫక్రుద్దీన్‌, సౌదీ రావుఫ్‌, మాజీ కౌన్సిలర్‌ రామచంద్ర మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2024లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అందరూ టిడిపి విజయం కోసం పని చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తనూ కలిసి వారి బాగోగులు తెలుసుకొని అండగా ఉంటామన్నారు. త్వరలోనే పట్టణంలో కూడా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. మాజీ కౌన్సిలర్‌ మల్లికార్జున, టిడిపి నాయకులు ఇస్వీ షేక్షావలీ, నారాయణపురం షేక్షావలీ, మల్లేష్‌, శీరా, రాముడు, సలకలకొండ రామకృష్ణ, బద్రి స్వామి, అలసంద గుత్తి అంజి, పెద్దహరివాణం రమేష్‌ పాల్గొన్నారు.