Apr 16,2023 23:33

ఎంఎల్‌ఎ చినరాజప్ప సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి కార్యకర్తలు

ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం కొత్తపేట ప్రాంతానికి చెందిన వైసిపి కార్యకర్తలు ఆదివారం స్థానిక కొత్తపేట రామాలయం వద్ద ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప సమ క్షంలో టిడిపిలో చేరారు. కొత్తపేటకు చెందిన కొల్లి రాజు, మేడిశెట్టి వెంకటేష్‌,కొల్లి దుర్గాప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, ఎలిశెట్టి నాని, కోరి పూరి రాజు పాల్గొన్నారు.