ప్రజాశక్తి-కందుకూరు :ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీలోని కొత్తపల్లెపాలెం గ్రామానికి చెందిన 8 కుటుంబాల వారు శనివారం టిడిపిలో చేరాయి. కందుకూరు లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన మాకా ప్రసాదు, గొల్లపోతు వెంకటేశ్వర్లు, గొల్లపోతు కోటేశ్వరరావు, గొల్లపోతు సురేష్, గొల్లపోతు జాలయ్య, కొక్కిలగడ్డ ఆదినారాయణ, కొక్కిలగడ్డ ఏడుకొండలు, కొక్కిలిగడ్డ జయరాం లు పార్టీలో చేరారు.ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ప్రస్తుతం చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పాలని నాగేశ్వరరావు వారికి సూచించారు. నియోజకవర్గ పరిశీలకురాలు కే. కుసుమకుమారి గారు, కరేడు గ్రామపార్టీ అధ్యక్షుడు కన్నా ప్రసాదు, క్లస్టర్ ఇంచార్జ్ పోలుబోయిన శ్రీనివాసులు ఉన్నారు.










