
ప్రజాశక్తి-కందుకూరు :వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఒటు వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని, అందుకోసం టిడిపికి ప్రజలు అండగా నిలబడాలని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు పట్టణంలోని 13వ వార్డులో శ్రీనగర్ కాలనీ -2, శ్రీరామ్ నగర్ కాలనీలో సోమవారం నిర్వహించారు. నాగేశ్వరరావు ఇంటింటికి తిరుగుతూ టిడిపి మినీ మేనిఫెస్టో కు సంబంధించిన కరపత్రాలను పంచారు. ఇంటూరి నాగేశ్వరరావు స్థానికులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము దోచుకుంటున్న వైనాన్ని అందరూ గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షులు యల్లంటి మాల్యాద్రి, స్థానిక నాయకులు, కనకరాజు భూసి రాజ ,జక్కుల రవి,ప్రసాద్,వెంకటరావు, దార్ల శ్రీను, గెంటినపల్లి బలరాం, లక్ష్మయ్య, చరణ్, సాయి, వరప్రసాద్, లోకేష్, విశాక్, పెద్దకత్తుల రవి, కిషోర్, బాబి,అభి, గోపి, భాబ్జి, మాధవ ఉన్నారు.