Mar 17,2023 23:36

అనకాపల్లిలో సంబరాలు నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు దాదాపుగా విజయం ఖాయమైన నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖ, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలత్లో విజయోత్సవాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లిలోని టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పని అయిపోయిందని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సూరే సతీష్‌, డాక్టర్‌ నారాయణరావు, మాదంశెట్టి నీలబాబు, పాల్గొన్నారు. టిడిపి బీసీ సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్‌ మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో స్థానిక భీముని గుమ్మం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కొణతాల రత్నకుమారి, పోలవరపు త్రినాథ్‌ పాల్గొన్నారు. మండలంలోని తుమ్మపాల గ్రామంలో మాజీ సర్పంచ్‌ కర్రి వెంకట సన్యాసినాయుడు (బాబి) ఆధ్వర్యంలో స్వీట్లు పంచి ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. నాయకులు గొర్లి శ్రీనివాసరావు, నడిపల్లి బోసు బాబు పాల్గొన్నారు.
కశింకోట : కశింకోట మండల కేంద్రంలో టిడిపి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆ పార్టీ నాయకులు వేగి గోపికృష్ణ, సిదిరెడ్డి శ్రీనివాసరావు, కలగా సోమేశ్వర రావు, ఎస్‌కె.బాబర్‌, తాకాశి కృష్ణ పాల్గొన్నారు. తాళ్ళపాలెం జంక్షన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉల్లింగల రమేష్‌ జెర్రిపొతల నూకి నాయుడు పాల్గొన్నారు.
సబ్బవరం : మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ జంక్షన్‌లో టిడిపి మండల అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి ఎన్టీఆర్‌ జంక్షన్‌ మీదుగా దుర్గమాంబ ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండి రవి కుమార్‌, బర్ణికాన బాబురావు, గండి దేముడు, గండి. ముత్యాల నాయుడు, కోటాన అప్పారావు, సర్పంచ్‌ దెడ్డము ప్రసాదరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : కె.కోటపాడు మూడు రోడ్ల కూడలిలో టిడిపి నాయకులు విజయోత్సవ సంబరాలు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి మాడుగుల నియోజకవర్గ నాయకులు పైలా ప్రసాదరావు మాట్లాడుతూ వేపాడ చిరంజీవిరావు గెలుపు టిడిపి పునర్వైభావానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రొంగళి మహేష్‌, నాయకులు డోకల నరసింహమూర్తి, పూడి నారాయణ మూర్తి, దాడి ఎరుకునాయుడు, బండారు నరసింహ నాయుడు, పైల గోపి పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం టిడిపి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జనపరెడ్డి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌ కుమార్‌, పుర్రె శ్రీనివాసరావు, రాజన్న నానాజీ, కాండ్రేగుల సూర్యనారాయణ, కర్రి ఆదిబాబు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని వడ్డాది, రాజాం, బుచ్చయ్యపేట తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు టిడిపి నాయకులు పూలమాలలు వేసే నివాళులర్పించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.
కోటవురట్ల : టిడిపి మండల అధ్యక్షులు జానకి శ్రీను ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వేచలపు జనార్ధన్‌, పుట్రవు సూర్యారావు, తిరుమలరావు, ఎంపిటిసి సభ్యులు సూర్యప్రకాష్‌, భాస్కర్‌రావు పాల్గొన్నారు.
రావికమతం : మండల కేంద్రంలో సర్పంచ్‌ గెంజి మోది నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న పట్టభద్రులు దూర దృష్టితో ఆలోచించి ఓటు వేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరుపాక ఎంపీటీసీ సూర్యనారాయణ, రావికంతం ఎంపిటిసి నాగేశ్వరరావు, కన్నంపేట మాజీ ఎంపిటిసి బంటు శ్రీను పాల్గొన్నారు.
గాజువాక : ఉత్తరాంధ్ర పట్టభద్రుల తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయమని టిడిపి గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం సంబరాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర, విశాఖను దోచేసిన వైసిపి నేతలకు మంచి ఆలోచనతో విజ్ఞత ప్రదర్శించిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పులి వెంకటరమణారెడ్డి, మాజీ కార్పొరేటర్‌ మహమ్మద్‌ రఫీ. టిడిపి నాయకులు విల్లా రామ్మోహనకుమార్‌, కోగంటి లెనిన్‌బాబు, నల్లూరి సూర్యనారాయణ, బైపల్లి గాంధీ పాల్గొన్నారు.
తగరపువలస : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన వేపాడ చిరంజీవిరావు విజయానికి చేరువ కావడంతో తాళ్ళవలసలో పార్టీ మండల అధ్యక్షులు డిఎఎన్‌ రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లువిజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేశారు. బాణసంచా కాల్చారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా జంక్షన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాళ్లవలస ఎంపిటిసికోరాడ రమణ, మాజీ జెడ్‌పిటిసి సరగడ అప్పారావు, నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు పతివాడ రాంబాబు, మాజీ సర్పంచ్‌ పొట్నురు రాము, నాయకులు అల్లు చిన్నయ్య, తమ్మిన వెంకటరమణ పాత్రుడు పాల్గొన్నారు.
ఆరిలోవ : తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఐదు వార్డుల నేతలంతా 12వ వార్డు టిడిపి కార్యాలయంలో శుక్రవారం విజయోత్సవం జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తోటగరువు నుంచి బాలజీనగర్‌ మీదుగా అంబేడ్కర్‌నగర్‌, ఆరిలోవ, టిఐసి పాయింట్‌ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఒమ్మి సన్యాసిరావు, బుడుమూరు గోవిందు, మద్దిల రాజశేఖర్‌, ఒమ్మి అప్పలరాజు, గాడి సత్యం, ఒమ్మి పోలారావు, పొత్రకండ ధర్మారావు, మూది అప్పారావు పాల్గొన్నారు.