Oct 31,2023 23:29

శింగరాయకొండలో సబరాలు నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - యర్రగొండపాలెం : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలు నుంచి విడుదల కావడంతో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, తోటా మహేష్‌ నాయుడు, షేక్‌ మస్తాన్‌వలి, చెవుల అంజయ్య, కొత్త భాస్కర్‌, గోళ్ల సుబ్బారావు, కందుల నారాయణరెడ్డి, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ వలి, బోడా చెన్న వీరయ్య, దొంగా వెంకట్రావు గౌడ్‌, అడుసుమల్లి రామచంద్రయ్య, రమణమ్మ పాల్గొన్నారు. పుల్లలచెరువు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బెయిల్‌పై విడుదల కావడంతో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బస్టాండ్‌ సెంటర్‌లో టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బెయిల్‌ మంజూరై విడుదల కావడం పట్ల టిడిపి నాయకులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి బాపట్ల నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మన్నంప్రసాదు మాట్లాడుతూ చంద్రబాబు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు కాట్రగడ్డ రమణయ్య, గొల్లపూడి సుబ్బారావు, జి.రాఘవరావు, సూరంపల్లి హనుమంతరావు,శిద్దా సుధాకర్‌, రావిపాటి శ్రీను, ఏసోబు, ఎస్‌కె.రఫీ, నాగరాజు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా దోర్నాలలోని నటరాజ్‌ సెంటర్‌లో టిడిపి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీపర్‌ మల్లికార్జునరెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, అంబటి వీరారెడ్డి, నాగేంద్రబాబు, శేషాద్రి, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శింగరాయకొండ : టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదల కావడంతో శింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. శింగరాయకొండలోని కందుకూరు రోడ్డు వద్ద బాణసంచా పేల్చిసంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేల్పుల సింగయ్య చీమకుర్తి కష్ణ, కూనపు రెడ్డి వెంకట సుబ్బారావు, మించల బ్రహ్మయ్య శీలం చంటి, సుదర్శి ప్రసాదరావు, కనిగిరి వెంకటేశ్వర్లు, షేక్‌ సందాని బాషా, కల్లగుంట నరసింహ, ఓలేటి రవి శంకర్‌ రెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలు నుంచి బయటకు రావడం పట్ల టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి బుడతా మధుసూదన్‌ యాదవ్‌, టిడిపి పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ శానేశావలి, మండల అధ్యక్షుడు మార్తాలా సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి పందీటి రజినీబాబు, రాష్ట్ర నాయకులు బైలడుగు బాలయ్య యాదవ్‌, షేక్‌ పెద్ద మస్తాన్‌, కుసుమాల మహానంది యాదవ్‌ పాల్గొన్నారు.మార్కాపురం రూరల్‌ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలు నుంచి బయటకు రావడంతో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు స్థానిక కంభం రోడ్డు కూడలి వద్ద బాణా సంచా పేల్చి స్వీటు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, నాలి కొండయ్య, ఎ. శ్రీను, కనిగిరి వెంకట రమణ, పి.గులాబ్‌ ఖాన్‌, పి.ఇబ్రహీంఖాన్‌, మొగల్‌ షాకీర్‌ హుస్సేన్‌, షేక్‌ నూరుల్లా, అలంకార్‌, షేక్‌ మహబూబ్‌బాషా, పి.ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా టిడిపి నాయకులు బాణా సంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఉప్పుగుండూరులో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మద్దిరాలపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోనూ సంబరాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు కాట్రగడ్డ చంద్రబాబు , కనాగాల శ్రీనివాసరావు ,తిరుమలశెట్టి శ్రీను,సెల్వం,గోగినేనిఆంజనేయులు, సాధినేని ఆంజనేయులు, పొట్లూరి నాగమల్లేశ్వరారావు,మండవ వాసు , చుండూరి నాగేశ్వరావు , గూడూరి ఝూన్సీ తదితరులు పాల్గొన్నారు.