Nov 02,2023 22:25

ప్రజాశక్తి - గోకవరం టిడిపి అధినేత చంద్రబాబుకు వచ్చిన మధ్యంతర బెయిల్‌పై టిడిపి చేస్తున్న సంబరాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉభయ గోదావరి జిల్లాల ఎస్‌సి సెల్‌ ఇన్‌ఛార్జ్‌ గుల్లా ఏడుకొండలు అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్‌ స్కాంలో చంద్రబాబు ముమ్మాటికీ ముద్దాయేనని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు మానవత్వంతో ఏవిధమైన ఆటంకాలు కల్పించకపోవడం వల్లే ఈ బెయిల్‌ వచ్చిందన్నారు. మధ్యంతర బెయిల్‌ అనంతరం ఆయన శాశ్వతంగా జైలులోనే ఉండాల్సివస్తాదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో మేళ్లు చేకూర్చుతున్న జగన్‌ రాబోయే 30 ఏళ్లు రాష్ట్రానికి సిఎంగానే ఉంటారని ఆయన జోస్యం చెప్పారు.