
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు, మాజీ కమ్యూనిస్టు మందపల్లి లక్ష్మయ్య(78) అ నారోగ్యంతో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక బుట్టాయగూడెం రో డ్‌లో, నూకాలమ్మ గుడి దగ్గర ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. సిపిఐలో రాజకీయ జీవితం ప్రారంభించి అనంతరం సిపిఎంలో చేరి ఎక్కువకాలం పనిచేశారు. అనంతరం లక్ష్మీపార్వతి ఎన్‌టిఆర్ టిడిపిలో కొంతకాలం పనిచేసిన తర్వాత 1999వ సంవత్సరంలో టిడిపిలో చేరి టిడిపి అనుబంధ సంఘమైన టిఎన్‌టియుసి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జిల్లా టిఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. లక్ష్మయ్యకు భార్య, ఇద్దరు కుమారులు కలరు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన మృతి చెందడంపై పలువురు సీనియర్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే స్థానిక ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.